టీ-20 జట్టులో గేల్‌కు చోటు

భారత్‌తో ఆదివారం జరుగనున్న ఏకైక టీ20 కోసం విండీస్ జట్టును ప్రకటించారు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, పొలార్డ్‌ను జట్టుకు ఎంపిక చేశారు. పొట్టి ఫార్మాట్‌లో రెండు శతకాలు బాదిన గేల్‌కు.. సొంత మైదానం సబీనా పార్క్‌లో ఇదే మొదటి టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌కు విశ్రాంతినిచ్చి.. బ్రాత్‌వైట్‌కు పగ్గాలు అప్పగించారు.  జట్టు వివరాలు: బ్రాత్‌వైట్ (కెప్టెన్), గేల్, బద్రీ, బేటన్, లెవీస్, మహ్మద్, నరైన్, పొలార్డ్, పావెల్, శామ్యూల్స్, టేలర్, వాల్టన్, విలియమ్స్.