టిబెట్‌లో వరద బీభత్సం 

టిబెట్‌ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు ఓ ఐదంతస్తుల బిల్డింగ్ పేకమేడలా కూలిపోయింది. పునాది నానిపోయిన ఆ భవంతి కూలే ప్రమాదం ఉండటంతో ముందస్తుగానే అందులో నివసించేవాళ్లను ఖాళీ చేయించారు. అనుకున్నట్టే ఆ భవనం ఒక్కసారిగా వెనక్కి వాలిపోయింది. రోడ్డుమీద పార్క్ చేసిన ఓ లారీ కూడా చూస్తుండగానే వరదలో పడి కొట్టుకుపోయింది.