టాప్ గేర్ లో దూసుకుపోతున్న నాని

టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ యువ హీరో నాని అంత అదృష్ణవంతుడు మరొకరు ఉండరేమో. గత కొన్నేండ్లుగా నాని పట్టిందల్లా బంగారమే అవుతున్నది. ఎలాంటి చిత్రం చేసినా నానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలు, పబ్లిక్ టాక్‌ను పక్కన పెట్టి ఆయన నటించిన చిత్రాలను ఆదరిస్తున్నారు. అదే క్రమంలో నాని నటించిన తాజా చిత్రం నిన్ను కోరి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. విమర్శకులు సందేహాలకు నిన్నుకోరి చక్కటి సమాధానం ఇస్తున్నది.

టాలీవుడ్‌లో నాని కెరీర్ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నది. సక్సెస్ రేటు రాకెట్ స్పీడ్ ముందుకెళ్తున్నది. నిన్ను కోరి చిత్రం నానికి వరుసగా ఆరో హిట్. నిన్ను కోరి చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఆయనకు ఇదే తొలి చిత్రమైనా అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను నడిపించాడు. అక్కడక్కడ కథను నడిపించడంలో కొంత తడబాటుకు లోనైనా ప్రేక్షకులను మెప్పించగలిగాడు.