జోరుగా టీఆర్ఎస్ లోకి వలసలు

టీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు  500 మంది కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. వారికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.