జీహెచ్ఎంసీ వావ్ క్లబ్ స్కూల్స్

విద్యార్థులకు చెత్తపై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ, ఐటిసి సంయుక్తంగా వావ్ క్లబ్స్ ని ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ శిల్పకళావేదికలో వెల్ బీయింగ్ ఔట్ ఆఫ్ వేస్ట్ (వావ్) క్లబ్ స్కూల్స్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. అన్ని పాఠశాలల్లో వావ్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తడి, పొడి చెత్తను వేరుచేసే వారి వివరాలను ఆగస్ట్ 15 నుంచి స్వచ్ఛ దూత్ యాప్ ద్వారా సేకరిస్తామన్నారు.

చెత్త, వేస్టేజ్ డంపింగ్ యార్డుకు వెళ్ళకముందే రీ సైకిలింగ్ చేయడం, వాటిని కంపోస్ట్ చేయడం, విద్యార్థులకు స్కూల్స్ లో చెత్తపై అవగాహన కల్పించడం వావ్ క్లబ్స్ ఉద్దేశమని జనార్దనరెడ్డి చెప్పారు. ఇంటర్ స్కూల్స్ రీ సైకిలింగ్ ఛాంపియన్ షిప్ ద్వారా విద్యార్థుల వద్ద ఉన్న పాత పుస్తకాలను, డ్రై వేస్ట్ ను, ఓల్డ్ న్యూస్ పేపర్స్, ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్ ను స్వీకరించి వారికి కొత్త పుస్తకాలను, స్టేషనరీని అందజేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ప్రభుత్వ-ప్రైవేట్ స్కూల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 2 వేల ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో వావ్ క్లబ్స్ ప్రారంభం కానున్నాయి.