జీఎస్టీ వేడుకకు టిఆర్ఎస్‌ నేతల హాజరు

పార్లమెంటు సెంట్రల్‌ హాల్ వేదికగా చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్ను.. జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఒకే దేశం-ఒకే పన్ను విధానం అధికారికంగా ప్రారంభమైంది. పార్లమెంట్‌ సెంట్రల్  హాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌, ఉప రాష్ట్రపతి హన్సారీ, ప్రధాని మోడీ, లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్.. జీఎస్టీ గంట మోగించి జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించారు.

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో జరిగిన జీఎస్టీ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రులు, ఎంపీలు, పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి ఎంపీ కవిత, జితేందర్ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ జీఎస్టీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.