జీఎస్టీ నంబర్‌తో పాన్ అనుసంధానం!

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) హయాంలో పన్ను ఎగవేతలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వ్యవస్థలను అనుసంధానం చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకోసం పరోక్ష పన్ను చెల్లింపుదారులకు జారీ చేసే జీఎస్టీ నంబర్‌ను వారి పాన్‌తో (శాశ్వత ఖాతా నంబర్) అనుసంధానం చేయాలని భావిస్తున్నది. తద్వారా వ్యాపారుల ఆదాయ పన్ను చెల్లింపులను వస్తు, సేవల పన్నుతో పోల్చి చూసేందుకు అవకాశం లభించనుంది. అందుకే ఆదాయం పన్ను చెల్లింపుదారులు తమ పాన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.