జీఎస్టీ అమలు కొత్త శకానికి నాంది  

జీఎస్టీ చారిత్రాత్మకమైన నిర్ణయమని పలువురు కేంద్రమంత్రులు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణించారు. ఒకే దేశం-ఒకే పన్ను విధానంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు.

అటు జీఎస్టీని ప్రవేశపెట్టిన ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి జైట్లీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ అమలు విప్లవాత్మకమైందని చెప్పారు. భారత ఆర్థిక రంగంలో సరికొత్త పరిణామమని కొనియాడారు.

అటు జీఎస్టీ అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. పలు రాష్ట్రాల్లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.