జీఎస్టీపై జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో రచ్చ

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రణరంగంగా మారింది. జీఎస్టీని వ్యతిరేకిస్తూ పలు విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో సభ గందరగోళంగా మారింది. సభ్యులు ఒక్కసారిగా నినాదాలు చేయడంతో వారిని సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్ కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో మార్షల్స్ చేత సభ్యులను బయటకు పంపించారు. సభను వాయిదా వేశారు. జీఎస్టీని వ్యతిరేకిస్తూ.. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ బయట కూడా ఆందోళనలు కొనసాగాయి.