జీఎస్టీపై ఆగస్టు 5న సమీక్ష

జీఎస్టీ అమలుతీరుపై ఆగస్టు 5న జీఎస్టీ కౌన్సిల్‌ సమీక్షించనుంది. కౌన్సిల్‌ మొదటి సమావేశం ఆగస్టులో మొదటి శనివారం జరుగుతుందని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ చైర్‌పర్సన్‌ వనజ ఎన్‌ సర్న తెలిపారు. జీఎస్టీ అమల్లో ఇప్పటి వరకూ ఎటువంటి ఆటంకాలులేవన్నారు. కాగా, జీఎస్టీ అమలుతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని నిపుణులు చెప్పారు. దీనికి కారణం జీఎస్టీ పరిధిలోకి వచ్చిన సరుకుల్లో అత్యధికం 12, 18 శాతం పన్ను పరిధిలో ఉండడమేనన్నారు.