జీఎస్టీకి వ్యతిరేకంగా సినిమా థియేటర్ల బంద్

జీఎస్టీకి వ్యతిరేకంగా తమిళనాడులో సినిమా థియేటర్ల బంద్ కొనసాగుతోంది.  రాష్ట్ర వ్యాప్తంగా 11వందలకు పైగా థియేటర్లు మూతపడ్డాయి. సినిమాపై జీఎస్టీని వ్యతిరేకిస్తూ…గతంలో ప్రదర్శనలు నిర్వహించిన యజమానులు….ప్రభుత్వం దిగిరాకపోవడంతో…బంద్ పాటిస్తున్నారు. ప్రస్తుతం వంద రూపాయల కంటే తక్కువ ధర ఉన్న టికెట్ పై 18 శాతం, ఎక్కువ ఉన్న టికెట్ పై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీంతో పాటూ 30శాతం మున్సిపల్ ట్యాక్స్ అదనంగా వసూలు చేస్తుండటంతో…తాము థియేటర్లు నడిపించే పరిస్థితి లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే థియేటర్ల బంద్ తో ప్రోడ్యూసర్లు నష్టపోవాల్సి వస్తుందని, వెంటనే బంద్ విరమించాలని నిర్మాతల మండలి కోరుతోంది.