జీఎస్టీకి వ్యతిరేకంగా వ్యాపారుల ఆందోళన

జీఎస్టీని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ లో జీఎస్టీ వద్దంటూ నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, మధ్యప్రదేశ్ లో వ్యాపారులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.