జమ్మూలో కాల్పులు

జమ్ముకశ్మీర్‌ లో మరోసారి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. బందీపోరాలో ఆర్మీ జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. హాజిన్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వ‌హిస్తున్న బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.