జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో రచ్చ…రచ్చ

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు కూడా విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. జీఎస్టీని వ్యతిరేకిస్తూ….విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంతేకాదు నిన్న అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపించడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే జీఎస్టీ బిల్లుకు విపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది.