జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురిని పొట్టనపెట్టుకున్న ఘటనపై ఆయన స్పందించారు. ఆ రాష్ట్రంలోని పీడీపీ, బీజేపీ సంయుక్త ప్రభుత్వం విఫలమైందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని తొలగించడంతో పాటు రాష్ట్రాన్ని సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం పరిధిలోకి తీసుకురావాలని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని చర్యలు విఫలమైనందున సైనిక ఆపరేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.