ఛత్తీస్ గఢ్‌ లో మావోయిస్టుల దుశ్చర్య

ఛత్తీస్ గఢ్‌ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. కాంకేర్ జిల్లా చార్‌ గామ్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో 20 భారీ వాహనాలను తగులబెట్టారు. ఆ ప్రాంతంలో మైనింగ్‌ ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా మైనింగ్‌ ఆపకుంటే ఇలాంటి ఘటనలే మళ్లీ జరుగుతాయని హెచ్చరిస్తూ లేఖ వదిలి వెళ్లారు.