చైనాలో వర్షాలు, వరదల బీభత్సం

భారీ వర్షాలతో చైనా అతలాకుతలమవుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో బ్రిడ్జీలు సైతం కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్ని నీటమునిగాయి. చెంగ్డు నగరంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి కరెంటు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. భవనాల పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. భారీ గాలుల ధాటికి ఓ ఆఫీసు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాంతో సిబ్బంది బయంతో పరుగులు తీశారు.