ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఇవాళ సాయంత్రం ఫలహారాల బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న పూజ చేసి ఫలహారాల బండిని ప్రారంభించారు. పోతురాజులతో కలిసి మంత్రి తలసాని నృత్యం చేశారు. డప్పు దరువుకు అనుగుణంగా స్టెప్పులేసి ఉత్సాహం నింపారు. పెద్దసంఖ్యలో విచిత్ర వేషధారులు, పోతురాజులు ఊరేగింపులో పాల్గొన్నారు.