గ్రామీణాభివృద్ధిలో వృత్తిదారులదే కీల‌క పాత్ర

గ్రామీణాభివృద్ధిలో వృత్తిదారులదే కీల‌క పాత్ర అని  నిజామాబాద్  ఎంపి క‌విత తెలిపారు‌. సీఎం కేసీఆర్‌ ముదు చూపుతోనే చేప పిల్లల పంపిణీతో పాటు గొర్రెలు పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. చేప పిల్లల పెంపకం సత్ఫలితాలిస్తోందని కవిత చెప్పారు. మిగతా చేతివృత్తుల వారికి కూడా ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. బోధ‌న్‌లోని  చావిడి వ‌ద్ద గొల్ల‌, కురుమ‌ల‌కు కవిత గొర్రెల‌ను పంపిణీ చేశారు. గొల్ల, కురుమ‌ల కోసం బోధ‌న్‌లో క‌మ్యూనిటీ హాలు నిర్మించుకునేందుకు త‌న నియోజ‌క వ‌ర్గ నిధుల‌నుంచి నిధుల‌ను కేటాయిస్తాన‌ని ఎంపి  క‌విత హామీ ఇచ్చారు.