గ్యాంగ్‌స్టర్‌ ఎన్‌ కౌంటర్‌ పై ఆందోళన, వ్యక్తి మృతి

రాజస్థాన్‌ లో ఓ గ్యాంగ్‌స్టర్‌ ఎన్‌ కౌంటర్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్  పాల్ సింగ్‌ ఎన్‌ కౌంటర్ పై సీబీఐతో విచారణ జరపాలని నాగౌర్‌ లో రాజ్ పుత్‌ లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి చనిపోగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌ జరిగి మూడు వారాలు గడుస్తున్నా గ్యాంగ్‌స్టర్‌ మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు నిర్వహించలేదు. 20 రోజులుగా మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే ఉంచేశారు.