గోవాలో 3 రోజుల పాటు పెళ్లి వేడుక

ప్రణయబంధాన్ని పూర్తి చేసుకుని పరిణయ ఘట్టం కోసం  నాగచైతన్య, సమంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మూడుముళ్ల బంధంతో ముచ్చటగా ఒక్కటయ్యే శుభతరుణం కోసం తనువెల్లా కనులై నిరీక్షిస్తున్నారు. వీరిద్దరి వివాహం అక్టోబర్ 6న జరగబోతున్నది. పెళ్లి వేడుకను గోవాలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. క్రైస్తవ, హిందూ సంప్రదాయరీతుల్లో నిర్వహించే ఈ వివాహానికి తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తున్నది. పెళ్లి తేదీలోగా చైతూ, సమంత తాము అంగీకరించిన సినిమా షూటింగ్‌లను పూర్తిచేయబోతున్నారని చెబుతున్నారు. వివాహానంతరం దంపతులిద్దరూ 40రోజుల పాటు న్యూయార్క్‌లో హనీమూన్‌కు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.