గోవధపై కేంద్రానికి సుప్రీంకోర్ట్ షాక్

పశువధపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  కబేళాలకు పశువులను అమ్మడంపై నియంత్రణ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీం కోర్టు. త్వరలోనే కొత్త ఆదేశాలను జారీ చేయాలని కేంద్రానికి సూచించింది. పశు విక్రయాల సమయంలో…కబేళాలకు వాటిని అమ్మడం లేదని ధృవీకరణ ఇవ్వాలని గతంలో కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేరళ, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు  కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేయబోమని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు తెగేసి చెప్పాయి. కేంద్రం ఉత్తర్వులపై గతంలో మద్రాస్ హైకోర్టు కూడా స్టే విధించింది. దీన్ని సుప్రీం కోర్టు సమర్ధిస్తూ…స్టేను కొనసాగించాలని తీర్పునిచ్చింది.