గోరక్షక పేరుతో దాడులు చేస్తే కఠిన చర్యలు

గో రక్షక దళాల పేరుతో అరాచకాలు సృష్టించే వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ. అలాంటి వారిని సహించేది లేదని, గోరక్షణ పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయన్నారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో…బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. రాష్ట్రపతి ఎన్నికలతో పాటూ, పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరుపై ప్రధాని వివరించారు. ఈ సమావేశానికి బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, ఎంఎం జోషి, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.