గంగూలీతో అందాల తార నృత్యం!

‘మామ్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా వుంది అందాల తార శ్రీదేవి. హిందీలో ఐదేళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్‌కతాలో చేపట్టే ప్రచార కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్ దాదా సౌరభ్ గంగూలీతో కలిసి శ్రీదేవి న్యత్యం చేసింది.  బెంగాలీ టాక్‌షో దాదాగిరికి సౌరభ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు శ్రీదేవి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన కొన్ని హిట్ సినిమాల్లోని పాటలకు సౌరభ్ గంగూలీతో కలిసి శ్రీదేవి నృత్యం చేసిందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ నెల 7న మామ్ చిత్రం విడుదలకానుంది.