ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరదలు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సత్తుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బొగ్గు గనుల్లోకి నీరు చేరింది. దీంతో, బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచలో రెండురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది.