కోవింద్ కు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ కు ధన్యవాదాలు

రాంనాథ్ కోవింద్ కు సంపూర్ణ మద్దతు పలికిన సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు  ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించగానే మద్దతిచ్చిన తొలి ఎన్డీఏతర పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారాయన. నోటిరద్దు, జీఎస్టీకి సపోర్ట్ తెలిపిన ముఖ్యమంత్రి  కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారాయన. అటు కోవింద్ విజయం ఖాయమని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.