కోదండరాం దుర్మార్గమైన బుద్ధిని వీడాలి

మేధావులుగా చెప్పుకునే కోదండరాం లాంటివాళ్లు అవాస్తవాల్ని ప్రచారం చేసి జిల్లాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. కోదండరాం, చంద్రకుమార్ లాంటివారు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా కుట్రలు చేస్తున్నారని, అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. నల్లగొండలోని ఆయన నివాసంలో సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి  నీటిని తరలించొద్దనడంలో కోదండరాం ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు అభివృద్ధిని అడ్డుకుంటూ.. మరోవైపు అభివృద్ధి లేదంటున్నారని, కోదండరాం తన దుర్మార్గమైన బుద్ధిని వీడాలన్నారు.