కోదండరాంపై అన్నదాతల కన్నెర్ర

అభివృద్ధికి అడుగడుగునా  అడ్డం పడుతున్న కోదండరాంపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలతో కుమ్మక్కై ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కోదండరాం తీరుపై రైతులంతా కన్నెర్ర జేస్తున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో రైతులు కోదండరాం దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ముందుకు సాగకుండా.. జిల్లాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కోదండరాం మాట్లాడుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి.. అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కోదండరాం తన రాజకీయ ప్రయోజనాల కోసం తమ జీవితాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు.