కొల్లాపూర్‌లో మొక్కలు నాటిన జూపల్లి

ఉద్యమంలా చేపట్టిన హరిత హారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్క ఎండిపోకుండా కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు.  ఈ ఏడాది 40 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో హరితహారానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ లో మూడో విడత హరితహారాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. తెలంగాణలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి తీసుకుపోయేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా  ఈసారి 12 కోట్ల మొక్కలను నాటుతామన్నారు. ఇందు కోసం 776 నర్సరీల్లో 7 కోట్ల 52 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.