కాల్పులకు తెగబడ్డ పాక్

జమ్మూకాశ్మీర్ లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. రాజౌరీ సెక్టార్ లోని మంజా కోటే ప్రాంతంలో ఈ ఉదయం నుంచి పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో భారత జవాన్లు వారికి ధీటుగా సమాధానమిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య భారీగా ఫైరింగ్ జరుగుతోంది. పాక్ రేంజర్లు జరుపుతున్న కాల్పుల్లో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రాజౌరి సెక్టార్ లోని స్కూళ్లు తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు.