కార్ల ధరలు భారీగా తగ్గింపు

జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలిరోజే వాహనాల కంపెనీలు ధరలు తగ్గించాయి. మారుతి సుజుకీ కార్ల ధరల్లో మూడు శాతం వరకు కోత విధించింది. ఆయా రాష్ర్టాల్లో విధిస్తున్న పన్నుల ఆధారంగా ధరల తగ్గింపులో మార్పులు ఉంటాయని తెలిపింది. అటు హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించిన డీజిల్ రకం సియాజ్, ఎర్టిగా మోడల్‌ ను లక్ష రూపాయల వరకు పెంచింది. ఇక టాటా మోటార్స్‌ కు చెందిన అంతర్జాతీయ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సైతం కార్ల ధరలను 7 శాతం వరకు తగ్గించింది. అటు లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ రూ.70 వేల నుంచి రూ.1.80 లక్షల వరకు కోత విధించింది.