కామెడీ చెయ్యాలనుకుంటున్న కాజల్!

ప్రస్తుతం వున్న పోటీ వాతావరణంలో కథానాయికలు 50 సినిమాలు పూర్తిచేసుకోవడం మామూలు విషయం కాదు. చక్కటి అందానికి అద్భుతమైన అభినయసామర్థ్యం తోడైతేనే ఈ మైలురాయిని చేరుకోవడం సాధ్యమవుతుంది. తాజాగా ఈ ఫీట్‌ను సాధించింది అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు ప్రస్తుతం రానా సరసన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. కాజల్ నటిస్తున్న 50వ చిత్రమిదే కావడం విశేషం. పదేళ్ల సినీ ప్రయాణంలో ఈ అరుదైన మార్క్‌ను చేరుకోవడం ఆనందంగా వుందని చెప్పింది కాజల్ అగర్వాల్. కెరీర్ సంతృప్తికరంగా సాగిపోతున్నదని, అయితే పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయకపోవడం వెలితిగా అనిపిస్తున్నదని చెప్పింది.  ఇప్పటివరకు నేను పుల్‌లెంగ్త్ హాస్య పాత్రలో నటించలేదు. ప్రేక్షకుల్ని మనసారా నవ్వించే కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ పదేళ్లలో కెరీర్‌లో మిగిలిపోయిన కోరిక అదొక్కటే అని కాజల్ అగర్వాల్ తెలిపింది.