కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు కనుమరుగయ్యాయి

తెలంగాణ ప్రజల సాగు, కరెంటు కష్టాల కు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు మంత్రి హరీష్‌  రావు. పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లిచ్చారని దుయ్యబట్టారు. పులిచింతల హైడల్  ప్రాజెక్టును 2006 లో రూపొందిస్తే 2014 లో టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం ఏర్పడ్డాక పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జూరాల  హైడల్ ప్రాజెక్టు  ను ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని మండిపడ్డారు. అరవై ఏళ్లలో 6 వేల మెగావాట్ల ఉత్పత్తి సాధిస్తే.. కేవలం మూడేళ్ళలో 12 వేల మెగావాట్లకు తీసుకెళ్ళామన్నారు..