కళాకారులకు నిలయం తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం కళాకారులకు నిలయంగా ఉందన్నారు ఎంపీ కవిత. ప్రభుత్వం తరఫున కళాకారులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆర్ట్‌ గ్యాలరీని ఎంపీ కవిత ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో ఫైన్‌ ఆర్ట్స్ కళాకారులు మరింత ముందుకు వెళ్లాలని కవిత సూచించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఏపీ నేత నన్నపనేని రాజకుమారి, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.