ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది.  హుజూరాబాద్‌ మండలం కందుగులలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గంగిరెద్దుల కాలనీకి చెందిన ఘంటా కొమరయ్య, అతని భార్య కొమురమ్మ………… తమ  కుమార్తెలు ఎల్లమ్మ, కోమల,అంజలికి ముందుగా  ఊరివేసి…తర్వాత వాళ్లిద్దరూ ఉరేసుకున్నారు .వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ రమణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. కొమురయ్య కుటుంబం ఆత్మహత్యకు మంత్రాల నిందారోపణలే కారణమని  స్థానికులు చెబుతున్నారు.