ఒకే కాన్పులో నలుగురు జననం

ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. తిరుమలాయపాలెం మండలానికి చెందిన సమీనా ప్రసవం కోసం ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. కాన్పులో ఆమె నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వారిలో ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడ శిశువు. కాగా శిశువులు బరువు తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్‌ లో ఉంచారు. ప్రస్తుతం వీరు ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు.