ఐఫోన్ల ధరలు తగ్గింపు

భారత మార్కెట్లో ఐఫోన్ ధరలను మోడల్‌ను బట్టి 4 శాతం నుంచి 7.5 శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్లు ఆపిల్ కంప్యూటర్స్ ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందజేసేందుకు ఈనెల 1 నుంచి ధరల తగ్గింపును అమలులోకి తెచ్చింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. అత్యంత ఖరీదైన ఐఫోన్ 7 ప్లస్  ధర గతనెల వరకు రూ.92 వేలుగా ఉండగా.. జీఎస్టీ అమలైన రోజు నుంచి రేటు రూ.85,400కు తగ్గింది. ఐఫోన్ 6ఎస్ ధర 6.2 శాతం తగ్గి రూ.46,900కు జారుకుంది.