ఐఐటీల్లో ప్రవేశాలపై సుప్రీం స్టే

ఐఐటీ – జేఈఈ కౌన్సెలింగ్ పై  సుప్రీం కోర్ట్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని పేర్కొన్నది.  తప్పుడు ప్రశ్నలకు గ్రేస్ మార్కులు కలపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా 33 వేల మంది విద్యార్ధులపై పడనుంది.  ఐఐటీ-జేఈఈ ఎంట్రెన్స్ సమయంలో తప్పుడు ప్రశ్నలకు 18 గ్రేస్ మార్కులు కలుపుతూ ఐఐటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు… స్టే విధించింది.