ఐఐటీ అడ్మిషన్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఐఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీం కోర్టు.  కౌన్సెలింగ్ పై గతంలో విధించిన స్టే ను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ లో తప్పుడు ప్రశ్నలకు గ్రేస్ మార్కులు కలపడంపై గతంలో సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గ్రేస్ మార్కులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు వాదించడంతో… అడ్మిషన్ల ప్రక్రియపై తాత్కాలిక స్టే విధించింది. అయితే దీనిపై ఐఐటీలు సరైన వివరణ ఇవ్వడంతో కౌన్సెలింగ్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో దాదాపు 36 వేల మంది విద్యార్ధులకు ఊరట కలిగింది.