ఏసీబీ హెడ్ క్వార్టర్ లో హరితహారం

ఆకుపచ్చ తెలంగాణ కోసం మేముసైతమంటూ అవినీతి నిరోధక శాఖ సిబ్బంది కూడా హరితహారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్ లో పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు. ఏసీబీ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరితహారంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, అందరూ మొక్కలు నాటాలని పూర్ణచంద్ర రావు కోరారు.