ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ ముందంజ

ఏరోస్పేస్ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.  పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని చెప్పిన కేటీఆర్.. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు.  హైదరాబాద్  బేగంపేట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఇండస్ట్రీ సెమినార్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కంపెనీల ఏర్పాటుకు అనువైన వాతావరణం హైదరాబాద్ లో ఉందన్నారు. ఎన్నో పరిశోధనా సంస్థలు ఒక్కడ ఉన్నాయని చెప్పారు. ఏరోస్పేస్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ రంగంలో హైదరాబాద్ ముందుందని తెలిపారు. ట్రంప్ హెలికాప్టర్ క్యాబిన్ కూడా ఇక్కడే తయారైతదని చెప్పారు. మార్చిలో ఇండియన్ ఏవియేషన్ షో ఉంటుందన్నారు. టీహబ్ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్నదని చెప్పారు. అటు ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్ లో ఉందన్న కేటీఆర్..  సింగిల్ విండో విధానం ద్వారా 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఈ సెమినార్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.