ఏడుపాయలలో హరితహారం

మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీఎఫ్‌వో పద్మజతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. హరితహారంలో భాగంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.