ఏడున్నర కోట్ల విలువైన బంగారం స్వాధీనం

డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి దగ్గర 25.8 కిలోల బంగారం ఉన్నట్టు గుర్తించారు. ఈ బంగారం విలువ దాదాపు 7కోట్ల 54 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారాన్ని బిళ్లల రూపంలోకి మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు, బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నారు.