ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనతో దురుసుగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్యేని మందలించారు. వెంటనే జిల్లా కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని సీఎం కేసీఆర్  హెచ్చరించారు. జరిగిన ఘటన పట్ల ముఖ్యమంత్రి తన బాధను, ఆవేదనను వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రీతి మీనాతో మాట్లాడి ప్రభుత్వం తరఫున సముదాయించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.