ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్  జరిగింది. బుద్గాం జిల్లాలోని ఓ గ్రామంలో ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దాంతో బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా గుర్తించారు. అనంత్ నాగ్ లో అమర్ నాథ్‌ యాత్రికులపై దాడి తర్వాత.. భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా    కాల్పులు చోటు చేసుకున్నాయి.