ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు

డ్రగ్స్, కల్తీల నియంత్రణపై మరింత దూకుడుగా వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ స్పందించింది.  అందులో భాగంగా మొదట సొంతశాఖను ప్రక్షాళన చేయాలని ఎక్సైజ్  డైరెక్టర్  అకున్  సబర్వాల్  నిర్ణయించారు. ఏళ్లుగా ఒకే చోట పోస్టింగుల్లో ఉన్న సిబ్బందిని బదిలీ చేశారు. 23 మంది అసిస్టెంట్  సెక్రటరీలు, 196 మంది ఇన్ స్పెక్లర్లు ట్రాన్స్ ఫర్ అయ్యారు.