ఉప రాష్ట్రపతి పదవి ఆశించడం లేదు!

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రచారం చేయటం సరికాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగుస్తుండటంతో ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ఎంపిక చేయనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పందించిన వెంకయ్య.. తాను ఏ పదవి ఆశించడం లేదని, తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ అన్నారు. అప్పటి వరకు ఎలాంటి ఊహగానాలు చెయ్యవద్దని సూచించారు. పార్లమెంటరీ బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా తమ పార్టీ ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం కానున్నది.