ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య నామినేషన్

ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు వెంకయ్యనాయుడు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి  ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్‌ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, ఎంఎం జోషీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ నుంచి ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తొలి సెట్‌ పై ప్రధాని మోడీ, రెండో సెట్‌ పై రాజ్ నాథ్‌ సంతకాలు చేశారు.