ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం

ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం కొనసాగుతోంది. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద ధాటికి పలు రహదారులు కొట్టుకుపోయాయి. చంపావట్ లో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. అయితే, అందులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డట్లు అధికారులు తెలిపారు.