23న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు సభ

ఈ నెల 23న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీడ్కోలు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. వీడ్కోలు సందర్భంగా ఎంపీలందరూ సంతకాలు చేసిన నోట్ బుక్ ను ప్రణబ్ ముఖర్జీకి బహుకరించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఈ నెల 20 లోగా ఎంపీలందరూ తమ సంతకాలను పార్లమెంటు లైబ్రరీలో ఉన్ననోట్ బుక్‌ లో నమోదు చేయాలని కోరారు.